న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాలతో సతమవుతున్న తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే క్రికెటర్లను ప్రభుత్వ ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ సెహ్వాగ్.. ఆర్సీబీతో ఓటమి తర్వాత మరోసారి విమర్శలు గుప్పించాడు. సీఎస్‌కేను పరాజయాలు వెంటాడుతుంటే, ఆ జట్టు ఆట తీరును సెహ్వాగ్ ఎండగడుతున్నాడు. ‘ఇది ఒకనాటి సీఎస్‌కే కాదు. గత సీఎస్‌కేకు, ఇప్పటి సీఎస్‌కేకు చాలా తేడా ఉంది. అసలు సీఎస్‌కే అంటే ఇదికాదు. గతంలో సీఎస్‌కేతో పోరు అంటే మిగతా జట్లు చివరి వరకూ భయపడుతూనే ఉండేవి. (చదవండి:పంత్ ఆడటంపై స్పష్టత లేదు: అయ్యర్)
ఇప్పుడు సీఎస్‌కేను ఓడించడం పెద్ద కష్టం కాదు అన్నట్లు మిగతా జట్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆట ఆ జట్టు ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ప్రధానంగా సీఎస్‌కే బ్యాటింగ్ ఆందోళనకు గురిచేస్తోంది. చాలామంది బ్యాట్స్‌మన్లు సమస్య నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నం చేయడం లేదు. క్రీజ్‌లోకి వెళ్లాం.. వచ్చాం అనే రీతిలో ఆడుతున్నారు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఘోరంగా ఓడిపోయింది. ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సీఎస్‌కే 132 పరుగులకే పరిమితమై 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే జట్టులో అంబటి రాయుడు(42; 40 బంతుల్లో 4 ఫోర్లు), జగదీషన్(33;28 బంతుల్లో 4ఫోర్లు)లు మాత్రమే ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment