ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నీతూ శుభారంభం చేసింది. ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన 48 కేజీల విభాగం తొలి రౌండ్‌లో నీతూ 5–0తో స్టెలుటా దుతా (రొమేనియా)పై నెగ్గింది. నేడు జరిగే బౌట్‌లలో హెరెరా (మెక్సికో)తో నిఖత్ జరీన్ (51 కేజీలు), కళా థాపా (నేపాల్)తో మనీషా (57 కేజీలు), మరియా బోవా (ఉక్రెయిన్)తో పర్వీన్ (63 కేజీలు), కెర్రీ డేవిస్ (ఇంగ్లండ్)తో సవీటి (75 కేజీలు) పోటీపడతారు.
Comments
Please login to add a commentAdd a comment