Senior Boxing Championship
-
భారత్ తీన్మార్ పంచ్...
విశ్వ వేదికపై భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను చాటుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా మూడు పతకాలతో తిరిగి రానున్నారు. పతక వర్ణాలు (స్వర్ణ, రజత, కాంస్య) ఇంకా ఖరారు కాకపోయినా పతకాలు మాత్రం ఖాయమయ్యాయి. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణా బాక్సర్లు దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్లో ఈ ముగ్గురు బరిలోకి దిగనున్నారు. గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజతాల కోసం పోటీపడతారు. ఓడితే మాత్రం కాంస్య పతకాలతో తమ పోరాటాన్ని ముగిస్తారు. తాస్కాంట్: ప్రత్యర్థి ఎవరైనా తమ పంచ్‌లతో అదరగొడుతున్న భారత బాక్సర్లు ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) తమ జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపక్ 5–0తో నుర్జిగిత్ దిషిబయేవ్ (కిర్గిస్తాన్)పై, హుసాముద్దీన్ 4–3తో దియాజ్ ఇబానెజ్ (బల్గేరియా)పై, నిశాంత్ దేవ్ 5–0తో జార్జి టెరీ క్యూలార్ (క్యూబా)పై గెలుపొందారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. ప్రపంచ పురుషుల బాక్సింగ్‌లో పవర్ హౌస్‌గా పేరున్న క్యూబా దేశ బాక్సర్‌పై భారత బాక్సర్ విజయం సాధిస్తాడని ఊహకందని విషయం. కానీ పట్టుదలతో పోరాడితే క్యూబా బాక్సర్‌ను కూడా ఓడించే సత్తా భారత బాక్సర్లలో ఉందని బుధవారం నిశాంత్ దేవ్ నిరూపించాడు. జార్జి క్యూలార్‌తో జరిగిన బౌట్లో నిశాంత్ ఆద్యంతం దూకుడుగా ఆడి పైచేయి సాధించాడు. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగిన నిశాంత్ ఈసారి సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు మూడో పతకాన్ని ఖాయం చేశాడు. 10 ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాలు. అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించగా... విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ (2017), మనీశ్ కౌశిక్ (2019), ఆకాశ్ (2021) కాంస్య పతకాలు గెలిచారు. తాజా ఈవెంట్లో హుసాముద్దీన్, దీపక్, నిశాంత్ దేవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. -
రెండో రౌండ్లో భారత బాక్సర్ నీతూ
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నీతూ శుభారంభం చేసింది. ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన 48 కేజీల విభాగం తొలి రౌండ్లో నీతూ 5–0తో స్టెలుటా దుతా (రొమేనియా)పై నెగ్గింది. నేడు జరిగే బౌట్లలో హెరెరా (మెక్సికో)తో నిఖత్ జరీన్ (51 కేజీలు), కళా థాపా (నేపాల్)తో మనీషా (57 కేజీలు), మరియా బోవా (ఉక్రెయిన్)తో పర్వీన్ (63 కేజీలు), కెర్రీ డేవిస్ (ఇంగ్లండ్)తో సవీటి (75 కేజీలు) పోటీపడతారు. -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్‌ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్‌జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
వికాస్, శివ శుభారంభం
దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (56 కేజీలు) శుభారంభం చేయగా... మనోజ్ కుమార్ (64 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. భారత బాక్సింగ్ సంఘంపై నిషేధం ఉన్నందున ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకంపై పోటీపడుతున్నారు. మంగళవారం తొలి రౌండ్లో వికాస్ 3-0తో జోల్టాన్ హర్సా (హంగేరి)పై, శివ థాపా 3-0తో ఖలీల్ లిటిమ్ (అల్జీరియా)పై విజ యం సాధించగా... మనోజ్ కుమార్ 1-2తో అబ్దెల్హక్ అతాక్ని (మొరాకో) చేతిలో, దేవేంద్రో సింగ్ 1-2తో హార్వీ హోర్న్ (బ్రిటన్) చేతిలో ఓడారు.