వికాస్, శివ శుభారంభం | Vikas, Shiva advance to pre-quarters at World Boxing Championships | Sakshi
Sakshi News home page

వికాస్, శివ శుభారంభం

Published Wed, Oct 7 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

Vikas, Shiva advance to pre-quarters at World Boxing Championships

దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), శివ థాపా (56 కేజీలు) శుభారంభం చేయగా... మనోజ్ కుమార్ (64 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. భారత బాక్సింగ్ సంఘంపై నిషేధం ఉన్నందున ఈ మెగా ఈవెంట్‌లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకంపై పోటీపడుతున్నారు. మంగళవారం తొలి రౌండ్‌లో వికాస్ 3-0తో జోల్టాన్ హర్సా (హంగేరి)పై, శివ థాపా 3-0తో ఖలీల్ లిటిమ్ (అల్జీరియా)పై విజ యం సాధించగా... మనోజ్ కుమార్ 1-2తో అబ్దెల్‌హక్ అతాక్ని (మొరాకో) చేతిలో, దేవేంద్రో సింగ్ 1-2తో హార్వీ హోర్న్ (బ్రిటన్) చేతిలో ఓడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement