
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో డ్వేన్ బ్రావోను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో డెత్ ఓవర్లలో(16 నుంచి 20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో చహల్ చోటు సంపాదించాడు.
మతీషా పతీరానా 12 వికెట్లతో టాప్‌లో ఉండగా.. చహల్ 11 వికెట్లతో రెండో స్థానంలో, తుషార్ దేశ్ పాండే 10 వికెట్లతో మూడో స్థానంలో, హర్షల్ పటేల్ 9 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే టాప్‌లో ఉన్న నలుగురు బౌలర్లలో ముగ్గురు పేసర్లు ఉంటే చహల్ మాత్రం ఏకైక స్పిన్నర్‌గా ఉన్నాడు.
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు.ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్‌ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్‌ల్లో 171) టాప్-5లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment