ఆగని అక్రమ దందా | - | Sakshi
Sakshi News home page

ఆగని అక్రమ దందా

Published Fri, Jan 31 2025 12:23 AM | Last Updated on Fri, Jan 31 2025 12:23 AM

ఆగని

ఆగని అక్రమ దందా

కందుకూరు రూరల్‌: అధికార టీడీపీ నేతలు బరితెగించారు. మండలంలోని కోవూరుకు చెందిన టీడీపీ నేత రమణయ్య ఇసుక అక్రమ దందాలో తన పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. పందలపాడు వద్ద పాలేరు వాగులో ఇసుక తవ్వకాలు వద్దంటూ ఆయనకు చెందిన ట్రాక్టర్లను గ్రామస్తులు బుధవారం నిలిపేయడం.. ఈ పరిణామం రుచించని ఆయన కోవూరులో పందలపాడుకు చెందిన వాహనాల రాకపోకలను అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీస్‌, రెవెన్యూ అధికారులు ఇక నుంచి ఇసుక తవ్వకాలు జరగకుండా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

పక్క రోజుకే సీన్‌ రివర్స్‌

తాజాగా రమణయ్యకు చెందిన ట్రాక్టర్లు పాలేరులోకి వెళ్లి ఇసుకను గురువారం తరలించసాగాయి. ఎన్నిసార్లు చెప్పినా పంతానికి పోయి సుమారు 20 అడుగుల లోతులో ఇసుకను తవ్వుకుంటున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు నిలిపేశారు. ఈ పరిణామం చోటుచేసుకున్న వెంటనే పందలపాడుకు చెందిన ఆటోలు, పాలవ్యాన్లు, ఇతర వాహనాలను కోవూరులో రమణయ్య నిలిపేశారు. దీంతో అధికారులకు సమాచారం వెళ్లడంతో ఇసుక ట్రాక్టర్లను పంపారు. అనంతరం కోవూరులోనూ రాకపోకలు కొనసాగాయి.

అధికారుల వత్తాసు

ఇసుక తవ్వకాలతో తమ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని, భూగర్భ జలాలు అడుగంటుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికార బలంతో కోవూరు టీడీపీ నేత రమణయ్య ఏ మాత్రం తగ్గడంలేదు. గ్రామస్తులు గురువారం అడ్డుకున్నా, పోలీసులతో బెదిరింపులకు గురిచేసి మరీ తరలించారు. రవాణాను అడ్డుకుంటే మా ఊరి నుంచి వెళ్లనిచ్చే పరిస్థితే లేదంటూ పంతానికి దిగారు. చర్యలు చేపట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కనిపించిందా.. మటాషే..!

మరోవైపు మామిడి తోటలు, మంచినీటి పథకాల వద్దకొచ్చిన ఇసుకను తరలిస్తున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇసుక తరలింపును రమణయ్య ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంతం నెగ్గించుకుంటున్న టీడీపీ నేత

ట్రాక్టర్లను అడ్డుకుంటే..

మా ఊళ్లో మిమ్మల్ని నిలిపేస్తాం

రెండో రోజూ కోవూరులో

రాకపోకల అడ్డగింత

ఇసుక మాఫియాకు

కొమ్ముకాస్తున్న అధికారులు

ఇసుక తరలింపును నిలిపేయిస్తాం

పందలపాడు వద్ద ఉచిత ఇసుక తరలింపునకు అధికారికంగా ఎలాంటి అనుమతుల్లేవు. ఈ వ్యవహారమై పోలీసులతో కలిసి శుక్రవారం వెళ్లి చర్యలు చేపడతాం. తరలింపును వీఆర్వో ద్వారా నిలిపేయిస్తాం. – ఇక్బాల్‌, తహసీల్దార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఆగని అక్రమ దందా 1
1/1

ఆగని అక్రమ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement