42 కేజీల వెండి స్వాధీనం
వెంకటాచలం: చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్లే కారులో అక్రమంగా తరలిస్తున్న 42 కేజీల వెండిని వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద సీసీఎస్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ సీఐ సీతారామయ్య ఆధ్వర్యంలో వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారును తనిఖీ చేశారు. కారులో సుమారు రూ.45 లక్షలు విలువ చేసే 42 కేజీల వెండిని గుర్తించారు. వెండితోపాటు కారును, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
రాజరాజేశ్వరిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
నెల్లూరు(బృందావనం): నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథ్‌శర్మ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ కోవూరు జనార్ధన్‌రెడ్డి, అర్చకులు న్యాయమూర్తిని సంప్రదాయంగా ఆహ్వానించారు. సుందరేశ్వర స్వామి వారిని దర్శించుకుని, తదుపరి ప్రత్యేకంగా నవావరణ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు హరిహరనాథ్‌శర్మ దంపతులకు వేద ఆశీర్వచనాలు చేసి పట్టువస్త్రాలు, తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
గ్రేడ్–3 ఏఎన్‌ఎం ప్రమోషన్ల సీనియారిటీ జాబితా విడుదల
నెల్లూరు(అర్బన్): ప్రమోషన్లు కల్పించేందుకు జిల్లాలోని సచివాలయాల గ్రేడ్–3 ఏఎన్‌ఎం (ఎంపీహెచ్‌ఏ–ఎఫ్) ఫైనల్ సీనియారిటీ జాబితాను ర్యాంక్‌ల వారీగా విడుదల చేశామని డీఎంహెచ్ ఓ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితా వివరాలు, ఖాళీల వివరాలు sps nellore.ap.gov.in/notice/recruitment అనే వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.
42 కేజీల వెండి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment