
పూర్వ ప్రాథమిక విద్య కీలకం
కందుకూరు రూరల్: మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమైందని డీఈఓ ఆర్.బాలాజీరావు అన్నారు. కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో అంగన్‌వాడీ కార్యకర్తలకు జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణను డీఈఓతోపాటు జిల్లా సమగ్ర శిక్షణ ఏఎంఓ జి.సుధీర్‌బాబులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలన్నారు. అనంతరం కార్యకర్తలు తయారు చేసిన అభ్యసనా సామగ్రి మేళాను వారు తిలకించారు. ఎంఈఓలు కె.సుబ్బారెడ్డి, బి.అజయ్‌బాబు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌ర్లు షకీలా, లక్ష్మి, ప్రభావతి, ఆర్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment