రాష్ట్ర స్థాయి ఇజ్తిమా ప్రారంభం
కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో రాష్ట్ర స్థాయి ఇజ్తిమా శనివారం ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు తరలి వచ్చారు. ప్రపంచ శాంతి కోసం శని, ఆదివారాల్లో ఇక్కడ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. శనివారం పలువురు మతబోధకులు బోధనలు, ప్రార్థనలు చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు నీళ్ల బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు అన్నదానం చేశారు. ఇజ్తిమాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగుకుండా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సైలు కోటిరెడ్డి, నరేష్, సీఐ సురేంద్రబాబు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment