పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో ఉదయభాస్కరరావు ఆదేశించారు. శనివారం డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో చీఫ్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, కస్టోడియన్లకు పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన వసతులను పరిశీలించి వెంటనే వారికి సదుపాయాలను కల్పించాలన్నారు. ఆర్‌ఐఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు ఫస్టియర్‌కు 28,176 మంది, సెకండియర్‌కు 25,024 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల్లో సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ 0861–2320312 నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమస్యలు, ఇబ్బందులపై ఈ నంబరుకు విద్యార్థులు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీవీఈఓ మధుబాబు, డీఈసీ కమిటీ సభ్యులు వేణుగోపాల్, కొండయ్య, డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్‌చార్జి రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment