పెండింగ్ బకాయిలపై పోరాటానికి సిద్ధం
● ఏపీ జేఏసీ అమరావతి
రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు
నెల్లూరు(అర్బన్) : ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆ సంఘం మెన్ అండ్ ఉమెన్ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలోని ఓ అతిథి గృహంలో జరిగింది. బొప్పరాజు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. పూర్తిస్థాయిలో విడుదల చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. పీఆర్‌సీతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు ఐక్యంగా ఉండి పోరాడితే పరిష్కారమవుతాయన్నారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గంలో కో చైర్మన్‌గా కీలక బాధ్యతలు నిర్వహించి జనవరిలో ఉద్యోగ విరమణ పొందిన పొదిలి చిన్నయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఆఫీసర్ల రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, కార్యదర్శి ప్రసాద్, ఫైర్ శాఖ అధ్యక్షుడు చంద్ర, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు, డ్రైవర్స్ సంఘం అధ్యక్షుడు చిరంజీవి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నాయకులు డానియేల్, పీటర్‌రావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment