
డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) అనుబంధ కళాశాలల్లో బుధవారం నిర్వహించిన డిగ్రీ ఆరో, నాలుగో సెమిస్టర్ల పరీక్షలకు 449 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎగ్జామ్స్ అధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఆరో సెమిస్టర్‌కు 55 మందికి 47 మంది హాజరు కాగా, మధ్యాహ్నం నిర్వహించిన నాలుగో సెమిస్టర్‌కు 7,573 మందికి 7,132 మంది హాజరయ్యారనితెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంలోని సెయింట్ మేరీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలిపారు.