ఎన్‌బీకేఆర్‌లో సాంకేతిక సదస్సు
కోట: విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఐఎస్టీలో గురువారం ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఇన్సిపిరాన్– 2025 సాంకేతిక సదస్సు జరిగింది. ఇందులో రాష్ట్రంలోని 12 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పేపర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విజేతలకు కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సాంకేతిక సదస్సుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఓడీ సురేష్‌రెడ్డి, కార్యక్రమ కో–ఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


