వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట నిషేధ భృతి క్రమం తప్పకుండా అందించింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రెట్టింపు మొత్తం ఇస్తామని ఎన్నికల సమయంలో నేతలు ప్రకటించారు. కానీ గత సంవత్సరం పరిహారం ఇంకా అందలేదు. ఈ ఏడా | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట నిషేధ భృతి క్రమం తప్పకుండా అందించింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రెట్టింపు మొత్తం ఇస్తామని ఎన్నికల సమయంలో నేతలు ప్రకటించారు. కానీ గత సంవత్సరం పరిహారం ఇంకా అందలేదు. ఈ ఏడా

Apr 4 2025 12:11 AM | Updated on Apr 4 2025 12:11 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట న

ఒట్టూరు తీరంలో చేపల వేట సామగ్రి

కావలి: రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో మర పడవల్లో అన్ని రకాల చేపల వేటపై ఈనెల 15 నుంచి జూన్‌ 16వ తేదీ వరకు నిషేధం ఉంటుంది. సంప్రదాయ పడవలు, తెడ్డు, తెరచాప పడవలు (ఇంజిన్‌ లేని) వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మత్స్య సంపద పునరుత్పత్తి సమయంలో వేట చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షార్హులవుతారు. వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ఇతర సంక్షేమ పథకాల నిలుపుదల చేస్తారు. జరిమానా విధింపుతోపాటు డీజిల్‌పై రాయితీ తొలగిస్తారు. వేట నిషేధ కాలాన్ని కచ్చితంగా అమలు చేయడానికి మత్స్య శాఖ, కోస్ట్‌గార్డ్‌, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తారు. ఇది చాలా ఏళ్ల నుంచి అమలవుతోంది. ఈ సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. వీరికి చేపల వేట మినహా మరో పనిచేయడం తెలియదు.

మత్స్య సందను కాపాడేందుకు విధించే వేట నిషేధ కాలంలో రిజిస్టర్డ్‌ మెకనైజ్డ్‌, మోటార్‌ ఫిషింగ్‌ బోట్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదు. ఈ నిషేధానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. నిషేధ కాలం 61 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం మత్స్యశాఖ వద్ద నమోదైన వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం చేసింది. అయితే రూ.20 వేలు వంతున అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. గతేడాది భృతికి సంబంధించి జిల్లాలో 12,444 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. వారికి ఇంత వరకు నగదు సాయం అందలేదు. మరబోట్ల ద్వారా సముద్రంలో వేట సాగించే ఈ 12,444 మందికి రూ.20,000 చొప్పున రూ.24.89 కోట్లు మేర అందాల్సి ఉంది.

ఆర్థిక ఇబ్బందులు

గతేడాది ఆగస్ట్‌ నుంచి డిసెంబర్‌ వరకు సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల ప్రభావంతో రోజుల తరబడి చేపల వేటకు వెళ్లలేకపోయామని, దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి వస్తుందని, గత ఏడాది పరిహారం సొమ్మును ఇప్పటికై నా విడుదల చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో మత్స్యకారుడి కుటుంబానికి రూ.20,000 అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

15 నుంచి

సముద్రంలో వేట నిషేధం

నాడు అండగా నిలిచిన

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గతేడాది భృతికి మోక్షం కల్పించని కూటమి ప్రభుత్వం

ఈసారైనా ఇచ్చేనా?

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట న1
1/1

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు వేట న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement