ఏఎస్‌పేట దర్గాలో హైడ్రామా
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేట మండల కేంద్రంలోని హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో శుక్రవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. దర్గా ఈఓ హుస్సేన్, దర్గా సజ్జదా హఫీజ్ పాషాల మధ్య వివాదం నెలకొంది. ఈఓ కథనం మేరకు.. దర్గాలో హఫీజ్ మతపరమైన కార్యకలాపాలు మాత్రమే చేసేలా 2023లో కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఆయన కుమారుడు లేదా పీఏల చేత సలాంలు పాడిస్తున్నారు. దీనిని శుక్రవారం కూడా కొనసాగించారు. ఈ విషయమై ఈఓ అభ్యంతరం తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి తన కుమారుడి చేత సలాంలు పాటిస్తుండటం సరికాదన్నారు. దీంతో హఫీజ్ దర్గా ముందు బైఠాయించారు. పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై సైదులు దర్గా వద్దకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. చివరకు హఫీజ్ సలాంలు పాడారు.
దర్గా ఈఓ, సజ్జదా మధ్య వివాదం
పోలీసుల జోక్యం


