భయపడేది లేదు.. ఎదుర్కొంటాం | - | Sakshi
Sakshi News home page

భయపడేది లేదు.. ఎదుర్కొంటాం

Apr 8 2025 7:11 AM | Updated on Apr 8 2025 7:11 AM

భయపడేది లేదు.. ఎదుర్కొంటాం

భయపడేది లేదు.. ఎదుర్కొంటాం

మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇన్‌చార్జిలు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి పాలకులు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడితే భయపడే వారు ఎవరూ లేరు. వైఎస్సార్‌సీపీ ప్రతి కార్యకర్తకు, నాయకుడితోపాటు మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కి తామంతా అండగా ఉంటామని జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్సీలు సంఘీ భావాన్ని తెలియజేశారు. నెల్లూరు ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో తప్పుడు కేసులు పెట్టడం, కోర్టులు స్పందించేలోపు మరో మరో కేసులు పెట్ట డం ఎంత వరకు సమంజసమన్నారు. కాకాణి దాక్కోవాల్సిన పనిలేదన్నారు. ఇప్పటికే కాకాణి మీద 7, 8 కేసులు ఉన్నాయన్నారు. అవినీతిని ప్రశ్నించే ఒకే ఒక్క గొంతును నొక్కాలని చూస్తే వైఎస్సార్‌సీపీ దీటుగా ఎదుర్కొంటుందన్నారు.

కూటమివి దొడ్డిదారి రాజకీయాలు

జిల్లాలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నేతలపై కేసుల పరంపర చూస్తే కూటమి దొడ్డిదారి రాజకీయాలు చేస్తుందని వెంకటగిరి ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేసుల్లో సత్తా లేక చిల్లర కేసులతో వేధింపులకు దిగే స్థాయి దిగజారిపోయిందన్నారు. వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ విషయంలో కూడా అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు. వెంకటగిరి, సైదాపురంలో నాలుగేళ్ల కిందట ఏవో తప్పులు జరిగాయంటూ తప్పుడు కేసులు ఇప్పుడు పెట్టారన్నారు.

కూటమి మారకపోతే తీవ్ర పరిణామాలు

కూటమి ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే ప్రతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల నుంచి దోపిడీలు, అక్రమాలు, అరాచకాలు మొదలు పెట్టిందన్నారు. వా రు చేస్తున్న దోపిడీల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే అక్రమ కేసులన్నారు. కాకాణిపై అక్రమ కేసుతోపాటు, అట్రాసిటీ కేసు పెట్టించడం దుర్మార్గ పు పాలన అన్నారు. పోలీసులు సైతం కొంచెం జా గ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

నిరాధార కేసులపై పోరాటం

నిరాధారమైన కేసులు పెడితే లెక్క చేసే వ్యక్తిత్వం కాకాణిది కాదని ఎమ్మెల్సీ మేరిగ మురళీ అన్నారు. అట్రాసిటీ కేసుపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చిందని, ఆధారాలు లేకుండా కేసు పెడితే కేసు రుజువు కాకపోతే ఆ తప్పుడు కేసు పెట్టిన వారిపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయని తెలుసుకోవాలన్నారు. అట్రాసిటీ కేసు వాడుకోవాలని చూడడం న్యాయ స్థానాలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.

భవిష్యత్‌లో అనుభవించక తప్పదు

తప్పుడు కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వం నాయకులు, అధికారులు భవిష్యత్‌లో వాటి ప్రతి పరిణామాలు ఫలితాలు అనుభవించక తప్పవని డీసీసీబీ మాజీ చైర్మన్‌ కె. సత్యనారాయణరెడ్డి అన్నారు. తనపై కూడా 11 కేసులు పెట్టారన్నారు. వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement