కిలో పొగాకు గరిష్ట ధర రూ.280
కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్‌కు చెందిన రైతులు 365 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 300 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 65 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి వి.మహేష్ కుమార్ మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్ట ధర రూ. 280, కనిష్ట ధర రూ. 230 లభించగా, సగటున రూ.262.74 లభించిందన్నారు. వేలంలో 10 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
ఇద్దరు విద్యార్థుల డిబార్
వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) అనుబంధ కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వీఎస్‌యూ ఎగ్జామ్స్ నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. మొత్తం 7,961 మంది విద్యార్థులకు 7,410 మంది హాజరు కాగా, 551 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
రూ.300 కోట్ల
సీ్త్రనిధి రుణాలు
● తక్కువ వడ్డీతో అందించేలా చర్యలు
● సీ్త్ర నిధి ఏజీఎం కామాక్షయ్య
నెల్లూరు (పొగతోట): ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు తక్కువ వడ్డీతో రూ.300 కోట్ల మేర సీ్త్రనిధి రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సీ్త్రనిధి ఏజీఎం కామాక్షయ్య తెలిపారు. మంగళవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో సీ్త్రనిధి పరపతి సహకార సమాఖ్య 19వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఏజీఎం మాట్లాడుతూ పట్టణ ప్రాంత స్వయం సహాయక మహిళలు బకాయిలు అధికంగా ఉండడంతో సీ్త్రనిధి రుణాలు ఇవ్వడం నిలిపి వేశామన్నారు. ఈ నెల నుంచి తిరిగి సీ్త్రనిధి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీ్త్రనిధి రుణాలు దోహద పడతాయన్నారు. సున్నా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వం దృిష్టిలో ఉందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేస్తే సీ్త్రనిధి రుణాలు వడ్డీ లేకుండా మంజూరు చే యడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరణపై
అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్‌హాల్‌లో సబ్‌కలెక్టరు, ఆర్డీఓలు, మున్సిప ల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2019 అక్టోబర్ 10వ తేదీ కంటే ముందు భూమిని ఆక్రమించుకుని ఆర్‌సీసీ స్లాబు లేదా రేకులతో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు ఆ ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరుతో జారీ చేసి రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై అధికారులు అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని, భూ వివాదాలను ప్రతి నెల మొదటి శనివారం తహసీల్దారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొంత సమయం కేటాయించి పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆధార్‌కార్డులు లేక ఎటువంటి ప్రభుత్వ రాయితీలు పొందలేకపోతున్న ఎస్టీల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కె కార్తీక్, డీఆర్‌ఓ ఉదయభాస్కర్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్‌ఈలు విజయన్, వెంకటరమణ, అశోక్‌కుమార్, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.280


