అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వేసవి నేపథ్యంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ విజయన్ అన్నారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా సర్కిల్లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసుల్ని మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. వేసవి నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయితే వెంటనే మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక విద్యుత్ లోడ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్‌ఫార్మర్స్ లోడ్ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను ముద్రిస్తున్నామని, ఫోన్‌పే, గూగుల్‌పేలో బిల్లులు చెల్లించే సౌకర్యం ఉందన్నారు. ఈ అవకాశం ప్రస్తుతానికి నెల్లూరు నగర విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉందన్నారు. అడిషనల్ లోడ్‌ను క్రమబ ద్ధీకరిస్తే 50 శాతం రాయితీ ఇస్తామన్నారు. జూన్ 30వ తేదీ లోపు దీనిని వినియోగించుకోవాలని కోరారు.
పెండింగ్ వ్యవసాయ సర్వీసుల
మంజూరు
ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ విజయన్


