విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
కలిగిరి: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కావలి ముస్తాపురంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. జామాయిల్ పొలంలో వ్యవసాయ పనులను రైతు నంబూరి చెంచునాయుడు (60) చేయసాగారు. ఈ క్రమంలో ఆయన చేతిలోని చలగపార విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. చెంచునాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
సంగం: సంగంలో అపస్మారక స్థితికి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి ఆత్మకూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక సంగమేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాల సందర్భంగా ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి శనివారం నిద్రించారు. ఆదివారం ఉదయం 10 గంటలకూ నిద్ర లేవకపోవడాన్ని స్థానికులు గమనించారు. అపస్మారక స్థితిలో ఉండటంతో 108లో ఆత్మకూరులోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి 45 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు.
స్కూటీని ఢీకొన్న కారు
● వ్యక్తి మృతి
జలదంకి: స్కూటీని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని జమ్మలపాళెం ఎస్వీఆర్ కల్యాణ మండప సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జలదంకి పోలీసుల వివరాల మేరకు.. జమ్మలపాళేనికి చెందిన తన్నీరు మాల్యాద్రి (50) కావలి నుంచి తన గ్రామానికి స్కూటీపై బయల్దేరారు. ఈ సమయంలో కావలికి చెందిన దాసరి మాధవరావు జమ్మలపాళెం వైపు కారులో వస్తూ స్కూటీని వెనుక వైపు నుంచి ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన మాల్యాద్రిని చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ఎస్సై లతీఫున్నీసా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంబేడ్కర్
జయంత్యుత్సవం నేడు
నెల్లూరు రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలో సోమవారం నిర్వహించనున్నామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీఆర్సీ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పుష్పాలంకారం, తదుపరి మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ సాంఘిక బాలికల వసతిగృహంలో జయంతి వేడుకలను నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమాలకు తరలిరావాలని కోరారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 46.81 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1380, పిన్నేరుకు ఐదు, లోలెవల్‌కు 50, హైలెవల్‌కు 30, మొదటి బ్రాంచ్ కాలువకు పది క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.
పౌల్ట్రీ ధరలు
బ్రాయిలర్: రూ.117
లేయర్ రూ.100
బ్రాయిలర్ చికెన్: రూ.210
స్కిన్‌లెస్ చికెన్: రూ.232
లేయర్ చికెన్: రూ.170
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం


