బధిరుల సంఘ జిల్లా సమావేశం
నెల్లూరు(బృందావనం): జిల్లాలో బఽధిరుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని బధిరుల సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు తెలిపారు. నగరంలోని పురమందిరంలో బధిరుల సంఘ జిల్లా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం పలు అంశాలను లిఖితపూర్వకంగా ఆయన తెలియజేశారు. బధిరులకు సేవలను విస్తృతంగా అందిస్తున్నామని వివరించారు. సంఘం ఏర్పడి 35 ఏళ్లయిన సందర్భంగా సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. నూనె మల్లికార్జునయాదవ్, మన్నేపల్లి పెంచలరావు, గాదిరాజు రామకృష్ణ, చిలకా రామకృష్ణ, కుమార్, మల్లికార్జున, సంఘ నేతలు మస్తానయ్య, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


