
వెంకటగిరికి చేరిన రవితేజ పార్థివదేహం
వెంకటగిరి రూరల్: అమెరికాలో గత ఆదివారం మృతి చెందిన వెంకటగిరి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాయివరప్రసాద్ కుమారుడు రవితేజ (35) పార్థివదేహం ప్రత్యేక విమానంలో చైన్నె ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు వెంకటగిరికి తీసుకొచ్చారు. వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి అనూష, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గల్లా సుదర్శన్, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు ప్రాంతాల్లోని పలువురు న్యాయవాదులు వెంకటగిరికి చేరుకుని రవితేజ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబ్జి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.