ఇంజినీర్లకు సన్మానం
రాపూరు: కండలేరు జలాశయంలో ఇంజినీర్లుగా పనిచేస్తూ పదోన్నతి పొంది బదిలీ అయిన ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఏఈగా పనిచేస్తున్న రేవతికి డీఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. మరో ఏఈ శ్రీనివాసరావుకు డీఈఈగా పదోన్నతి కల్పించి పులివెందులకు బదిలీ చేశారు. కండలేరులో డీఈఈగా పనిచేస్తున్న విజయరామిరెడ్డిని తిరుపతికి బదిలీ చేశారు. దీంతో అధికారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు అనిల్‌బాబు, అనిల్‌కుమార్, హర్షవర్థన్, తిరుమలయ్య, నాగయ్య, రమేష్‌బాబు, ఎన్జీఓ అధ్యక్షుడు తోట మల్లికార్జున, సిబ్బంది పాల్గొన్నారు.


