
రవాణాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అవినీతి ఎంవీఐ నిజాయితీ!!
రవాణా శాఖలోని కొందరు అవినీతి అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారు!. ‘అధిక లోడు వాహనం పట్టుకుంటే కేసులు, కోర్టులు, జరిమానాలు వంటి రిస్క్‌లు ఉంటాయి.. అదే మాకు లంచమిస్తే ఐదు నిమిషాల్లో వదిలేస్తాం’ అంటూ నిజాయితీగా పాపభీతిని చూపిస్తున్నారు. ప్రభుత్వాదాయానికి గండికొట్టి, వాహన యజమానుల కడుపులు కొట్టి, తమ జేబులు నింపుకుంటున్నారు. ఒక పక్క గ్రానైట్, ఇసుక, గ్రావెల్, యాష్, క్వార్ట్ ్జ వంటి మెటల్ రవాణా చేసే అధిక టన్నేజీల లారీలకు నెలమామూళ్లు తీసుకుంటూ రైట్ రైట్ చెబుతూ.. అన్నం పెట్టే రైతులు పండించిన ధాన్యం రవాణా చేసే లారీలకు ముక్కు పిండి లంచం వసూలు చేస్తున్నారు. బహుశ వీరి అవినీతి దాష్టీకం వల్లనే కాబోలు కొనుగోలుదారులు ధాన్యం ధరలు తగ్గించడానికి కారణం అయి ఉంటుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.