చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు | - | Sakshi
Sakshi News home page

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు

Sep 29 2025 11:06 AM | Updated on Sep 29 2025 11:06 AM

చిన్న

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు

● పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్‌ వద్ద డ్రెడ్జింగ్‌ పనులు చేస్తుండగా పైపు పగిలి ఒక యువకుడు గల్లంతై మృతి చెందగా, మరో యువకుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. అంతకు ముందు ఇదే ప్రాంతంలో చేపలు పట్టేందుకు వచ్చిన ఓ గిరిజన యువకుడు ఇసుక గోతుల్లో కూరుకుపోయి మృత్యువాత పడ్డాడు. ● కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం నుంచి జమ్మిపాళెం వరకు వివిధ ఘటనల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు, పశువులు మేపేందుకు వెళ్లి మరొకరు, సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇంకో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

గ్రావెల్‌ మాఫియా ధనదాహం కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. సరదాగా ఆడుతూ.. పాడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. గ్రామానికి చెందిన నూతేటి ప్రసాద్‌ లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూతేటి విష్ణుకుమార్‌ (11), మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఎక్కడికైనా ఇద్దరే వెళ్లి సరదాగా ఆడుకుంటూ కలిసి మెలిసి తిరిగేవారు. గ్రామానికి సమీపంలో డ్రాగన్‌ ప్రూట్‌ తోట ఉండడంతో ఇద్దరు స్నేహితులు కలిసి డ్రాగన్‌ ప్రూట్స్‌, కలేకాయల కోసం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఉయ్యాలపల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద గ్రావెల్‌ మాఫియా తవ్విన గుంతల్లో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండడంతో యంత్రాల సహాయంతో నీటిని మళ్లీంచారు. మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు.

● వెంకటాచలం మండలంలో ఊరూరా నాణ్యమైన గ్రావెల్‌ ఉండడంతో రాత్రి, పగలు తేడాలేకుండా చెరువుల్లోనూ తవ్వకాలు చేస్తుండటంతో పలు గ్రామాల్లో చెరువులు బావులను తలపిస్తున్నాయి. ఈ బావుల్లో అయాయక ప్రజలు పడి మృత్యువాతకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ నేతలు సాగించిన గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్‌ పరిసరాల్లోనే 9 మంది పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిలింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు, అమానవీయ ఘటనలకు లెక్కే లేకుండా పోతోంది. ధనదాహంతో నరమేధ చరిత్ర సృష్టిస్తున్నారు. వీరు చేసే తప్పు వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఏమీ పట్టనట్లుగా అక్రమ సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక, గ్రావెల్‌ తవ్వకాల అక్రమాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న ఈ దోపిడీ దాష్టీకాలు అమాయక కుటుంబాలపై ఎన్నటికీ నయం కాని గాయాలు మిగులుస్తున్నారు. ఇటీవల ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం, గ్రావెల్‌ గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటం, సూరాయపాళెం వద్ద జరిగిన దుర్ఘటన, సర్వేపల్లిలో గతంలోనే తొమ్మిది మంది చిన్నారుల మరణాలు ఒకే వాస్తవాన్ని చాటుతున్నాయి.

13 మంది ప్రాణాలు తీసిన ఇసుక తవ్వకాలు

జిల్లా పరిధిలో పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ఎక్కడా అధికారిక అనుమతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 నెలలుగా టీడీపీ నేతలు ఊరూరా అడుగడుగునా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. రూ.వందల కోట్లు విలువైన ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించారు. టీడీపీ నేతల ఇసుక తవ్వకాలకు ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు వద్ద ఇసుక తవ్వకాలకు రీచ్‌కు ఎలాంటి అనుమతే లేదు. కానీ అక్కడ రీచ్‌లోకి ఏకంగా పక్కాగా గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అక్కడి నుంచి ఇసుక తవ్వి తీసుకు వస్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ తప్పతాగిన మైకంలో రాంగ్‌ రూట్‌లో ఎదురుగా కారును ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. టీడీపీ నేతల పాపానికి ఈ దుర్ఘటనలో ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెండు కుటుంబాల్లో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. మరో కుటుంబంలో ఇప్పటికే తండ్రిపోయిన బిడ్డలు.. ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్నారు. మరో రెండు కుటుంబాల్లో ఇంటికి మగ దిక్కు లేకుండా చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుని ఉంటే.. ఆ కుటుంబాలు ఇలా రోడ్డునే పరిస్థితి వచ్చేది కాదు. ఈ దుర్ఘటన జరిగాక అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాల్లో సానుభూతి ప్రకటనలిచ్చి చేతులు దులుపుకున్నారే కానీ.. వారిని ఆదుకోవాలనే ఆలోచన ఎంత మాత్రం చేయకపోవడం దారుణం. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామనే భరోసా కల్పించలేకపోయిన రాతి గుండెలని మరోసారి రుజువు చేసుకున్నారు.

సంగం మండలం పెరమన వద్ద ఇసుక టిప్పర్‌ ఢీకొన్న దుర్ఘటనలో కారులోనే మృతదేహాలు (ఫైల్‌)

ఇసుక, గ్రావెల్‌ మాఫియాల దాష్టీకాలకు అమాయకుల బలి

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్‌ ఢీకొని ఏడుగురి దుర్మరణం

గ్రావెల్‌ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృత్యువాత

సూరాయపాళెం వద్ద ఇద్దరు బలి

సర్వేపల్లిలో గతంలోనూ గ్రావెల్‌ గోతుల్లో పడి 9 మంది పిల్లలు మృతి

పెన్నా ఇసుక, గ్రావెల్‌ గుంతల్లో ప్రాణాలు కోల్పోయిన పలువురు

ఈ పాపాలు ఎవరివి?

అధికార మదం, ధనదాహంతో అనుమతులు తీసుకోకుండా మైనింగ్‌ శాఖ ప్రామాణికాలు పాటించకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన చేపడుతున్న ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలకు అమాయక పిల్లలు, ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతల దగ్గర మామూళ్లు దండుకుంటూ రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రాణాలు పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ పాపాలు అధికారులవా? టీడీపీ నేతలవా?. ఇప్పటికై నా కలెక్టర్‌, ఎస్పీతోపాటు జిల్లా మైనింగ్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

టీడీపీ నేతల ధన దాహం.. అమాయక పిల్లలు, ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమాలకు ప్రజల ప్రాణాలు పోతున్నా.. కనీసం వీరిలో ఏ మాత్రం మానవత్వం కనిపించడం లేదు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి చూస్తుంటే కసాయితత్వం కనిపిస్తోంది. జిల్లాలో ఇసుక, గ్రావెల్‌ మాఫియాల దారుణాలకు అనేక కుటుంబాలకు ఎన్నటికీ తీర్చలేని కడుపు కోత, కన్నీటి వేదన మిగిలిపోతున్నాయి. ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా తవ్వి, భారీ వాహనాల్లో తరలిస్తూ ప్రజలను బలి తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు టీడీపీ నేతల స్వార్థపూరిత అరాచక పాలనకు చీకటి సాక్ష్యాలు.

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు 
1
1/3

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు 
2
2/3

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు 
3
3/3

చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్‌ గుంతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement