డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్
● విజయవంతానికి సహకరించండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
నెల్లూరు (లీగల్): డిసెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారించడంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. శ్రీనివాస్ కోరారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం నెల్లూరు, తిరుపతి జిల్లాల వివిధ శాఖల అధికారులతో శనివారం జిల్లా కోర్టులోని జడ్జి చాంబర్‌లో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే వాణి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజిత, జేసీ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓవై నందన్, జిల్లా కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ సన్యాసిరావు, డీఎంహెచ్‌ఓ సుజాత, అటవీశాఖ అధికారి మాల్యాద్రి, నెల్లూరు రూరల్ డీఎస్పీ జీ శ్రీనివాసరావు, నెల్లూరు, గూడూరు ఎకై ్స జ్ సూపరింటెండెంట్లు, హౌసింగ్, ఫైర్, బ్యాంకు, ఇన్సురెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


