టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట
నెల్లూరు (పొగతోట): టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకం పడకేసింది. నెలల తరబడి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడంలో రాజకీయ స్వార్థం మితిమీరడంతో పనులు, నిధులు మంజూరు కాక ముందడుగు పడడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిరంతరం పనులు కల్పించి పేదల ఆర్థిక కష్టాలు తీర్చింది. జిల్లాలో రోజుకు లక్ష నుంచి 1.20 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యే వారు. దీంతో జాతీయ స్థాయిలో అనేక పర్యాయాలు అవార్డులు లభించాయి. అంతటి ఘన చరిత్ర కలిగన ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం కుప్ప కూల్చేసింది. ప్రస్తుతం రోజుకు 3 వేల నుంచి 5 వేల మంది లోపు పనులకు హాజరవుతున్నారు.
తలనొప్పిగా మారిన ఎఫ్‌ఏల తొలగింపు
గ్రామ పంచాయతీల్లో సంవత్సరాల తరబడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను (ఎఫ్‌ఏ) తొలగించి ఆ స్థానాల్లో టీడీపీ కార్యకర్తలను నియమించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మంది ఎఫ్‌ఏలను తొలగించారు. ఆ స్థానంలో 200 మంది కొత్త ఎఫ్‌ఏల పేర్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మిగతా 400 మంది పాత ఎఫ్‌ఏలు కోర్టును ఆశ్రయించడంతో వారి పేర్లు తొలగించలేక, కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాత, కొత్త ఎఫ్‌ఏలకు ఏడాది కాలంగా వేతనాలు రావడంలేదు.
టీడీపీ అనుకూలురకే పనులు
కొత్త ఎఫ్‌ఏలు టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కావడంతో పనులు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం, రాజకీయ కోణం కనిపిస్తోంది. దగదర్తి మండలం తురిమెర్లకు చెందిన శేఖరయ్య నిరుపేద. అతనికి భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబం. అయితే ఆయనకు రాజకీయ రంగు పులిమి పనులు కల్పించడంలేదు. దీంతో ఈ పేద కుటుంబం ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతోంది. ఇటువంటి కుటుంబాలు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. టీడీపీకి అనుకులంగా ఉండే కూలీలకు మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ఇతర పార్టీల కూలీలు పనులు అడిగినా కల్పించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఎస్‌పేట మండలంలో నూతనంగా చేరిన ఎఫ్‌ఏలు ఇతర పార్టీల వారికి పనులు కల్పించమని బహిరంగంగ చెబుతున్నారని ఉపాధి హామీ కూలీలు చెబుతున్నారు. దీంతో పనుల్లేక కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఉదయం 11 గంటల వరకు ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలు ఇంటికి వచ్చి భోజనం తిని మరొక పనికి వెళ్లే వారు. దీంతో రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు సంపాదించుకునే అవకాశం ఉండేది. జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించారు. అయితే నిర్దేశించిన పనిదినాలు ఇప్పటికే లక్ష్యం పూర్తయ్యాయి. కొత్త పనిదినాలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పనిదినాలు తీసుకురావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అభివృద్ధి కుంటు పడుతుండగా, పేదలకు ఉపాధి కొరవడుతోంది.
ఉపాధి హామీ పనులకు హాజరైన శ్రామికులు
టీడీపీ నేతల ధనదాహానికి పడకేసిన పథకం
కోర్టు ఆదేశాలనూ ధిక్కరించి
ఎఫ్‌ఏలుగా ఆ పార్టీ కార్యకర్తలు
అరకొరగా పనులు..
అయినా బిల్లులు రావు
పనిదినాలు కల్పించడంతో
ప్రభుత్వం విఫలం
ఉపాఽధి హామీ కూలీలకు 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదు. చేసిన వర్కులకు బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కూలీలకు సుమారుగా రూ.20 కోట్లకు పైగా వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాజకీయ కారణాలు, వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడం తదితర కారణలతో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. లక్ష సంఖ్య నుంచి 3 వేలకు శ్రామికుల సంఖ్య పడిపోయింది. కూలీలకు రూ.400 కోట్ల మేర వేతనాలు కల్పిస్తే.. రూ 200 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మంజూరవుతాయి. టీడీపీ నేతల చర్యల వల్ల ఇటు పేదలకు ఉపాధి లేదు.. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా పోయాయి.
సిబ్బంది, కూలీలకు
వేతన బకాయిలు
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట


