వినాయకుని పుట్టినరోజు ... గణేశ్ చవితి పండుగ వస్తోంది! ఈ రోజున పెద్దవాళ్లు, పెద్ద పెద్ద పందిళ్ల నిర్వాహకులూ పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి భారీ ఎత్తున పూజించడం మీకు తెలుసు కదా... అయితే ప్రకృతి ప్రేమికుడైన గణనాయకుడు ప్రకృతి సిద్ధమైన, సులువుగా తిరిగి ప్రకృతిలో కలిసి పోయేలా ఉండే మట్టిగణపతి విగ్రహాలను పూజించే వారికే బోలెడన్ని ఆశీస్సులు అందిస్తాడని మీకు తెలుసు కదా... మట్టి గణపతిని మీ చిట్టి చేతులతో స్వయంగా మీరే తయారు చేసి పూజలో ఉంచి, గణపతికి ఇష్టమైన పిండివంటలు ఆరగింపజేసి, మీ కోరికలన్నీ కోరండేం! సమయం ఆసన్నమైంది.
‘అయ్యో! మాకు విగ్రహం తయారు చేయడం రాదే అనో, మా దగ్గర బంకమట్టి లేదు కదా... ఇప్పుడెలా’ అనో దిగులు పడకండి. మట్టిగణపతి విగ్రహం తయారు చేసే విధానాన్ని మేమే మీకు నేర్పిస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు కూడా సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మట్టి గణపతి విగ్రహాల తయారీలో మీకు శిక్షణనిచ్చేందుకు ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో 5 నుంచి 16 సంవత్సరాల లోపు గల బాలలందరూ పాల్గొనవచ్చును.
దీనికి ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేదు. బంకమట్టిని నిర్వాహకులే ఉచితంగా సమకూర్చుతారు. అయితే మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే... దిగువ తెలిపిన నంబర్లకు ఫోన్‌చేసి మీ పేర్లను నమోదు చేసుకోవడమే! ఈ శిబిరంలో పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టిని గణనాయకుని ప్రతిమలుగా రూపొందించే విధానాన్ని నేర్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? మీరు కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, మీరు తయారు చేసిన వినాయక ప్రతిమలను ఇంటికి తీసుకు వెళ్లి పూజించండి. శిక్షణకు వచ్చేవారు పాత వాటర్‌బాటిల్, పాతవస్త్రం వెంటతీసుకు రావడం మాత్రం మరచిపోవద్దే!
సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో
అవిఘ్నమస్తు, అభీష్ట సిద్ధిరస్తు.
శిబిరం చిరునామా:
తేది : 16–09–2023 (శనివారం)
సమయం : ఉ. 9.30 గం.ల నుంచిమధ్యాహ్నం 12.30 గం.ల వరకు.
రిజిస్ట్రేషన్లకు సంప్రదించవలసిన
శ్రీసాయి విద్యానికేతన్ సాయిగీతా స్కూల్,
డో.నంబర్ : 2/189, పెద్ద బజారు, పుట్టపర్తి.
ఫోన్ నంబరు : 9912220726
Comments
Please login to add a commentAdd a comment