వినతులు.. వేడుకోళ్లు
కదిరి అర్బన్: స్థానిక ఆర్డీఓ కార్యాలయం సోమవారం జనంతో కిక్కిరిసింది. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న జనం అర్జీలు సమర్పించేందుకు తరలిరాగా రెవెన్యూ డివిజన్‌న స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కిటకిటలాడింది. సంక్షేమ పథకాలు అందివ్వాలని ఒకరు.. భూమి కబ్జా చేశారని ఇంకొకరు.. న్యాయం చేయాలని మరొకరు..ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యను ఏకరువు పెట్టారు. కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమానికి మొత్తంగా 420 అర్జీలు అందగా..వాటిని ఆయా శాఖలకు పంపారు. గ్రీవెన్‌న్స్‌కు రాలేని వారు మెయిల్ ద్వారా కూడా అర్జీలను పంపించవచ్చని కలెక్టర్ సూచించారు.
అర్జీ దారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలపైనే ఎక్కువగా అర్జీలు అందుతున్నాయని, వాటి పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడ సుదర్శన్, డీపీఓ విజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ వెంకటరమణారెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ విజయశాంతిబాయి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, ఎల్‌డీఎం రమణకుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని ఇలా...
● దివ్యాంగుడైన తాను మానసికంగానూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని, పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎన్‌పీకుంట మండలం దాసరివాండ్లపల్లికి చెందిన వేమనారాయణ కలెక్టర్‌కు కలెక్టర్‌కు విన్నవించారు.
● తమ కులస్తుల కోసం పాలిటెక్నిక్ కళాశాల పక్కనే కేటాయించిన స్థలంలో బంజారా కమ్యూనిటీ భవనం నిర్మించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాంప్రసాద్‌నాయక్ కలెక్టర్ చేతన్‌ను కోరారు.
● మరాఠాల శ్మశానవాటిక కోసం కేటాయించిన స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని పట్టణానికి చెందిన మరాఠా కులస్తులు కలెక్టర్ చేతన్‌ను కోరారు.
● పెండింగ్‌లో ఉన్న 6 నెలల జీతాలు చెల్లించి, టాస్క్‌లు ఇవ్వాలని కదిరి మండలానికి చెందిన ఫీల్ట్ అసిస్టెంట్‌లు మారెప్ప, భాస్కర్, రవినాయక్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
‘పరిష్కార వేదిక’కు భారీగా అర్జీలు
వివిధ సమస్యలపై 420 వినతులు
సంతృప్తికర పరిష్కారం చూపాలని కలెక్టర్
చేతన్ ఆదేశం
ఈ చిత్రంలోని చిన్నారి పేరు పార్వతి. వయసు ఆరేళ్లు. తనకల్లు మండలం పాలెంవాండ్లపల్లి గ్రామం. పుట్టుకతో నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. తండ్రి శ్రీకాంత్ కూలిపనులు చేసుకుని జీవిస్తున్నాడు. కుటుంబ పోషణకే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాను కూతురు పార్వతికి చికిత్స చేయించేందుకు ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని కదిరి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చేతన్‌ను వేడుకున్నారు.
ఇతనిపేరు హనుమంతరెడ్డి. కదిరి మండలం చిప్పలమడుగు గ్రామం. ప్రభుత్వం యర్రదొడ్డి పొలం సర్వేనంబర్‌లు 362–18, 362–17లో ఐదెకరాల భూమి ఇచ్చింది. రామకృష్ణారెడ్డి పేరుమీద పట్టా, పాసుపుస్తకం కూడా మంజూరు చేసింది. కానీ సాగు చేసుకునేందుకు వెళితే.. కుటాగుళ్ల గ్రామానికి చెందిన నరసింహులు, గణేష్ అడ్డుతగులుతున్నారు. దీంతో హనుమంతరెడ్డి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చేతన్‌కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసులు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంతృప్తికర పరిష్కారం చూపాలి..
వినతులు.. వేడుకోళ్లు
వినతులు.. వేడుకోళ్లు
Comments
Please login to add a commentAdd a comment