హంద్రీ–నీవా లైనింగ్ పనుల అడ్డగింత
కనగానపల్లి: హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎవరికో మేలు చేసేందుకు తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తగరకుంట సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద లైనింగ్ పనులు చేపట్టేందుకు బుధవారం కాంట్రాక్టర్లు యంత్రాలతో రాగా, విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అక్కడికి వెళ్లి పనులు చేపట్టకూడదన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణాజలాలు తరలించేందుకు తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాలువ వెడల్పు, జంగిల్ క్లియరెన్స్‌కు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ కాలువకు సిమెంట్ వేసి లైనింగ్ చేస్తే ఒప్పుకోబోమన్నారు. దీనివల్ల కాలువ సమీపంలో భూగర్భజలమట్టంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో తగరకుంట, పాతపాల్యం గ్రామాల సర్పంచ్‌లు మాధవరాజులు, రాజాకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.
కాలువకు సిమెంట్ లైనింగ్ వల్ల భూగర్భజలమట్టం తగ్గుతుంది
తమకు అన్యాయం చేయవద్దని
రైతుల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment