హిందూపురం అర్బన్/ అగళి: ఫిబ్రవరి కూడా దాటకనే ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఎండతీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు.
34 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు..
జిల్లాలో గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా 34 డిగ్రీలకు చేరాయి. రాత్రి పూట ఉక్కుపోత కూడా మొదలైంది. పల్లెలో ఉక్కు పోత తట్టుకోలేక ఇళ్లపై పడుకుంటున్నారు. మార్చిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా చేరే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఇంత ఎండలేదని ఈసారి అప్పుడే భానుడు ఉగ్ర రూపం చూపుతున్నాడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణశాఖ అధికారులు సైతం రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నట్లు హెచ్చరిస్తున్నారు.
తగ్గిన చలి తీవ్రత..
జనవరిలో చలి తీవ్రంగా ఉన్నప్పటికీ 20 రోజులు తిరక్కుండానే వాతావరణంలో ఎంతో మార్పు కనిపిస్తోంది. చలి తీవ్రత తగ్గింది. మంచు కురవడం కూడా తగ్గడం.. ఎండలు మండుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం .. సాయంత్రం మినహా బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment