జగన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండ
ధర్మవరం అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌లు మాసపల్లి సాయికుమార్, చందమూరి నారాయణరెడ్డి, కౌన్సిలర్ గజ్జల శివ, ఎస్సీ, ఎస్టీ విభాగం నేత చౌడప్ప, చాంద్‌బాషా కోరారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్‌కు వారు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్నారు. ఐటీడీపీ కార్యకర్తలు జగన్ ప్రతిష్టని దెబ్బ తీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని కోరారు.
కదిరి టౌన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు కోరారు. ఈమేరకు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డికి న్యాయవాది వెంకటరమణారెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జోనల్ ఇన్‌చార్జ్ లింగాల లోకేశ్వర్‌రెడ్డి, లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రసాద్‌రెడ్డి, నాయకులు నరేష్‌రెడ్డి, కృష్ణానాయక్, మణికంఠనాయక్ తదితరులు ఉన్నారు.
జగన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండ
Comments
Please login to add a commentAdd a comment