కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నిరసన
సాక్షి, పుట్టపర్తి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందంటూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిరుద్యోగులు, వ్యవసాయం, ఆహార సబ్సిడీ, విద్య, ఆరోగ్యం గత బడ్జెట్‌లో కన్నా ప్రాధాన్యత తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ను ప్రజలందరూ తిరస్కరించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు కల్పించాలని, ఉపాధి పథకానికి 50 శాతం నిధులు పెంచాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
అడవికి నిప్పు పెట్టిన
వ్యక్తి అరెస్టు
పుట్టపర్తి: అడవులకు నిప్పు పెట్టి వృక్ష సంపదకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బుక్కపట్నం రేంజ్ ఆఫీసర్ యామినీ సరస్వతి హెచ్చరించారు. గురువారం ఆమె బుక్కపట్నం అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బుక్కపట్నం రేంజ్ పరిధిలో కొండకమర్ల సమీపంలో రిజర్వు ఫారెస్టుకు ఈ నెల 17న నిప్పు పెట్టారన్నారు. సిబ్బందితో పాటు స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేశామని పేర్కొన్నారు. ఓడీచెరువు మండలం అల్లాపల్లి పరిధిలోని ఓ రైతు పొలం గట్టుకు నిప్పు పెట్టడంతో మంటలు అడవికి వ్యాపించినట్లు తేలిందన్నారు. దీంతో కమ్మవారిపల్లికి చెందిన రైతును అరెస్టు చేశామన్నారు.
చింతపండు @ 31 వేలు
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.31 వేలు పలికింది. గురువారం మార్కెట్‌కు 962 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.31 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.11 వేలు, కనిష్టంగా రూ.4,500, సగటున రూ.6,500 ప్రకారం పలికింది. కాగా, గత వారంతో పోలిస్తే క్వింటా చింతపండు (కరిపులి రకం) రూ.7 వేలు తగ్గింది. సగటు ధర సైతం క్వింటాపై రూ.500 తగ్గుదల కనిపించింది.
ఫైనాన్స్ సంస్థ వేధింపులు
● మహిళ ఆత్మహత్యాయత్నం
హిందూపురం అర్బన్: పట్టణంలోని హస్నాబాద్‌కు చెందిన సుమయ అనే మహిళతో పాటు ఆ ప్రాంతానికి చెందిన కొందరు సంఘంగా ఏర్పడ్డారు. వారికి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ అప్పు ఇచ్చింది. సుమయ రూ.2 లక్షలు రుణం తీసుకొని ఎన్ని కంతులు కట్టినా వడ్డీకే సరిపోవడం.. అప్పు తీరక పోవడంతో ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గురువారం రాత్రి ఆమె ఇంటి వద్దకు వచ్చి అప్పు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఎంత చెప్పినా వినలేదు. ఇంటి దగ్గర నుంచి వెళ్లకపోవడంతో మనస్తాపానికి గురైన సుమయ ఇంట్లోనే చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నంచింది. కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు వెంటనే ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నిరసన
కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నిరసన
కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం నిరసన
Comments
Please login to add a commentAdd a comment