బాలికల రక్షణ కోసమే ‘ఆధ్య’
రామగిరి: బాలికల శక్తిని తెలియజేస్తూ సమాజంలో చోటు చేసుకుంటున్న విపరీతాలపై అవగాహన కల్పించేలా ఆధ్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ రత్న తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రామగిరి మండలంలోని నసనకోట సమీపంలో ఉన్న ఏపీఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఆధ్య కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలసి ఆమె ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, డీఎస్పీ హేమంత్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు తొందరగా అన్నింటికీ ఆకర్షితులవుతుంటారన్నారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేని స్థితిలో పెడదారి పట్టి ఉజ్వల భవితను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాకు బానిసలుగా మారితే జీవితాలు నాశనమవుతాయన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఒక బాలిక తప్పు చేస్తే అది ఎంతో మందిపై ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మండల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ రత్న
Comments
Please login to add a commentAdd a comment