నిలకడగా చింతపండు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్‌లో నిలకడగా ఉంది. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 1,217 క్వింటాళ్ల చింతపండు రాగా.. అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.15 వేలు పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.11 వేలు, కనిష్టంగా రూ. 4 వేలు, సరాసరిన రూ.5 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
నేడు పెడపల్లిలో
‘మహిళా భద్రతకు భరోసా’
పుట్టపర్తి అర్బన్: మహిళా భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం పుట్టపర్తి మండలం పెడపల్లిలో ‘మహిళా భద్రతకు భవిష్యత్తుకు భరోసా’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు పెడపల్లి ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యే కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అలా వెళ్లి.. ఇలా వచ్చారు!
● చర్చనీయాంశమైన ఎకై ్సజ్ సీఐ
లక్ష్మీదుర్గయ్య వ్యవహారం
● నెల క్రితమే కమిషనరేట్‌కు అటాచ్
● మళ్లీ హిందూపురం సీఐగా పోస్టింగ్..
హిందూపురం అర్బన్: ఎకై ్సజ్ సీఐ లక్ష్మీదుర్గయ్య హిందూపురాన్ని వదలడం లేదు. ఎక్కడికి బదిలీ చేసినా నెలల వ్యవధిలోనే మళ్లీ హిందూపురానికే పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం... మహారాష్ట్ర, గోవా మద్యం రవాణా అవుతున్నా కట్టడి చేయలేకపోవడం, బెల్టు దుకాణాలు విచ్చల విడిగా ఏర్పాటు కావడంతో ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు సీఐ లక్ష్మీ దుర్గయ్యపై నెల రోజుల క్రితమే బదిలీ వేటు వేశారు. విజయవాడ ఎకై ్సజ్ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. కానీ నెల తిరక్కముందే ఆయన హిందూపురానికి పోస్టింగ్ తెచ్చుకున్నారు. సెలవురోజైనా ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మీ దుర్గయ్య వ్యవహారం అటు ఎకై ్సజ్ శాఖలోనూ, ఇటు ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీ ఆశీస్సులతోనే...
హిందూపురం ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 9 మద్యం దుకాణాలున్నాయి. ఈ దుకాణాలను లాటరీ ద్వారా ఇతరులు దక్కించుకన్నా... ఆ తర్వాత వారి నుంచి అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు తీసుకున్నారు. ఇప్పుడా దుకాణాలన్నీ ఆ నలుగురే నడిపిస్తున్నారు. ఆయా దుకాణాల పరిధిలో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో పాటు మద్యం దుకాణాల్లోనే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఎకై ్సజ్ వ్యవహారాల్లో’ ఆరితేరిన లక్ష్మీ దుర్గయ్య అయితేనే తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన అధికార పార్టీకి చెందిన మద్యం సిండికేట్‌దారులు.. రాష్ట్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో లక్ష్మీదుర్గయ్యకు మళ్లీ హిందూపురానికే పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.
నిలకడగా చింతపండు ధర
Comments
Please login to add a commentAdd a comment