జూన్ 10లోపు ‘హంద్రీ–నీవా లైనింగ్’ పూర్తి కావాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ వేసే పనులు వేగవంతం చేసి
జూన్ 10వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ఇంజినీర్లతో సమావేశమయ్యారు. జిల్లా పరిధిలో ప్రధాన కాలువ లైనింగ్ పనులకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...హంద్రీ–నీవా ద్వారా చివరి ఆయకట్టు వరకూ నీరందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే ఫేజ్–2 పనుల్లో భాగంగా 260 కిలోమీటరు నుంచి 404 కిలోమీటరు వరకు కాలువకు లైనింగ్ పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ రాజస్వరూప్ కుమార్, ఈఈ వెంకటేష్ శెట్టి, మురళి తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం
● ‘డయల్ యువర్ డీపీఓ’లో ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో అహరహం శ్రమించే పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ రత్న తెలిపారు. ఈ క్రమంలోనే పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి నాలుగో శనివారం ‘డయల్ యువర్ డీపీఓ’ కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు ఆమె వెల్లడించారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ‘డయల్ యువర్ డీపీఓ’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డయల్ యువర్ డీపీఓలో పోలీస్ సిబ్బంది తమ జీతభత్యాలు, సరెండర్, మెడికల్ లీవ్‌లు, హెచ్‌ఆర్‌ఏలు, ఇంక్రిమెంట్లు తదితర సమస్యలు తెలుపుకోవచ్చన్నారు. స్థానికంగా అందుబాటులో లేని వారు వాట్సాప్ ద్వారా సమస్యను వివరిస్తూ మెసేజ్ పంపవచ్చన్నారు. సమస్యలకు 15 రోజుల్లోపు పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ సుజాత, సూపరింటెండెంట్లు సరస్వతి, మల్లికార్జున, సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 10లోపు ‘హంద్రీ–నీవా లైనింగ్’ పూర్తి కావాలి
Comments
Please login to add a commentAdd a comment