
వీరభద్రస్వామి రథానికి పూజలు
లేపాక్షి: శివరాత్రి పర్వదినం సందర్భంగా లేపాక్షి వీరభద్రస్వామి రథోత్సవం కోసం సిద్ధం చేసిన రథానికి శనివారం ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని బస్టాండు ఆవరణకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్ మాట్లాడుతూ... ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు లేపాక్షిలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రథోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో రథోత్సవం నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు.
చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
లేపాక్షి: టెంకాయలు కోసేందుకు చెట్టు ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తూ పట్టు తప్పి కిందపడటంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బొమ్మసముద్రం గ్రామానికి చెందిన నవీన్ (23) లేపాక్షి మండలం కంచిసముద్రంలో కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం టెంకాయల కోసం చెట్టు ఎక్కాడు. టెంకాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ నరేంద్ర సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment