సద్బుద్ధి ప్రసాదించు సాయీ
ప్రశాంతి నిలయం: అందరినీ ప్రేమించు..అందరినీ సేవించు అంటూ విశ్వశాంతిని కాంక్షించిన సత్యసాయి నామామృతంతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఆధునిక నాగరికత పేరిట అదుపుతప్పిన మానవులకు సద్బుద్ధి ప్రసాదించు సాయీ అంటూ భక్తులు వేడుకున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయికుల్వంత్ సభా మందిరంలో అతిరుద్రం మహాయజ్ఞం తొమ్మిదో రోజు శనివారమూ కొనసాగింది. మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తలు వేదమంత్రాలు..సత్యసాయి కీర్తనలతో ఆధ్యాత్మిక పరవశం చెందారు. సాయంత్రం సత్యసాయి సన్నిధిలో కుమారి రక్షిత రాంజి బృందం సంగీత కచేరీ నిర్వహించింది. సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment