వైఎస్సార్ సీపీ కార్యకర్తపై రాళ్ల దాడి
చెన్నేకొత్తపల్లి: ఒంటరిగా వెళ్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్త రాళ్లదాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..మండల పరిధిలోని నాగసముద్రం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. దీంతో టీడీపీకి చెందిన సుబ్బరాయుడు అతనిపై కక్ష గట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమయం కోసం వేచి చూస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం సుబ్రహ్మణ్యం వ్యక్తిగత పని నిమిత్తం నాగసముద్రం నుంచి ఎన్‌ఎస్ గేట్‌కు వెళ్తుండగా... చెరువు కట్ట కింద టీడీపీ కార్యకర్త సుబ్బరాయుడు అడ్డుకున్నాడు. అనంతరం సుబ్రహ్మణ్యంపై రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన సుబ్రహ్మణ్యం చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. పెదవికి పెద్ద గాయం కావడంతో వైద్యులు కుట్లు వేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment