
పల్లెలను పరిశుభ్రంగా ఉంచుదాం
హిందూపురం అర్బన్: ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్త సేకరించి సంపద కేంద్రాలకు తరలించి పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి సమత పేర్కొన్నారు. శనివారం ఆమె హిందూపురం మండలం తూముకుంట, సంతేబిదనూరు పంచాయతీల్లో పర్యటించి చెత్త తొలగింపు.. సంపద కేంద్రాలకు తరలించే ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రతి గ్రామంలో ఓ ప్రణాళిక పరంగా ఉదయం 10 గంటలలోపు చెత్త తొలగించాలని సూచించారు. నేరుగా కూలీలతో, స్వీపర్లతో మాట్లాడి చెత్త సేకరణలో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఆమె వెంట తూముకుంట, కిరికెర పంచాయతీ కార్యదర్శులు ఎన్. కెంచరాయప్ప, ఇబ్రహిమ్, సర్పంచ్‌లు రత్నమ్మ, లలిత ఉన్నారు.
ముగిసిన శనీశ్వరాలయ ఉత్సవాలు
పావగడ: స్థానిక శనీశ్వరాలయంలో 12 రోజులుగా నిర్వహిస్తున్న శనీశ్వరస్వామి జాతర ఉత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజు శనీశ్వరస్వామి, జ్యేష్ఠాదేవిల ఉయ్యాలోత్సం, శయనోత్సవం వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో ఆలయ పదాధికారులు, భక్తులు పాల్గొన్నారు.

పల్లెలను పరిశుభ్రంగా ఉంచుదాం
Comments
Please login to add a commentAdd a comment