ప్రశాంతి నిలయం: హోలీ పర్వదిన వేడుకల్లో భాగంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల భక్తులు నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సత్యసాయి భక్తులను అలరించాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన ఇరు రాష్ట్రాల భక్తులు గురువారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ‘భరత్ మిలాప్’ పేరుతో రామాయణంలో రాముడి వనవాస సమయంలో రాముడిపై భక్తిభావన, వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ వనవాసం వెళ్లకూడదు అని భరతుడు వేడుకున్న అంశం ఇతివృత్తంగా ప్రదర్శించిన నాటిక ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.
మము కరుణించు సాయీ ..