సోమందేపల్లి: మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మాజీ సర్పంచ్ కంబాలప్ప ఆధ్వర్యంలో స్థానికులు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా ఎస్సీ, బీసీ కాలనీ వాసులకు తాగునీరు అందడం లేదన్నారు. విషయాన్ని అధికారులకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై న అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని కోరారు.
సత్యసాయి సందేశం అనుసరణీయం
ప్రశాంతి నిలయం: ఆధ్యాత్మికత, సేవా మార్గం వైపు నడిపిస్తూ సత్యసాయి అందించిన సందేశం నేటి యువతకు అనుసరణీయమని సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అన్నారు. సత్యసాయి ఆధ్యాత్మిక, సేవా తత్వాలపై యువతను చైతన్యవంతులను చేసేందుకు సత్యసాయి సేవా సంస్ధల ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ సత్యసాయి వాహిని సుధామృత కోర్సును పూర్తి చేసిన వారికి ఆదివారం సర్టిపికెట్లను అందజేశారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కోర్సును దేశీయంగా 750 మందికి పైగా అభ్యసించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆదివారం ఉదయం యజూర్ మందిరం నుంచి ర్యాలీగా సత్యసాయి సందేశాలను ప్రదర్శిస్తూ మహాసమాధి చెంతకు చేరుకున్నారు. ఆర్.జె రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి సేవా సంస్ధల ద్వారా యువతను చైతన్యవంతులను చేసేందుకు పలు కోర్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘రాజా’కు ఘన వీడ్కోలు
గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్‌నగర్‌లోని ఆర్‌పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.
ఖాళీ బిందెలతో నిరసన
ఖాళీ బిందెలతో నిరసన