
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
ఎన్‌పీకుంట: వీధి కుక్కలు దాడి చేయడంతో గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఎన్‌పీకుంట మండలం ఎస్‌కే తండా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రైతు దుంగావత్ కృష్ణానాయక్ పాడితో పాటు గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటిక సమీపంలోని గొర్రెల కోసం ఓ దొడ్డిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గొర్రె, మేక పిల్లలను దొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లి వచ్చేసరికి వీధి కుక్కలు చొరబడి 10 గొర్రె పిల్లలు, పది మేక పిల్లలను చంపేశాయి. రూ.90 వేలు నష్ట పోయినట్లు రైతు వాపోయాడు.
అభివృద్ధి పనుల ప్రారంభం
సోమందేపల్లి: స్థానిక సప్తగిరి కాలనీ, గీతానగర్‌లో రూ.1.50 కోట్లతో తలపెట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను మంత్రి సవిత ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్ర కుమార్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.