
వజ్రపుకొత్తూరు: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళకు ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందించడమే కాకుండా ఆమెకు రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నాడు ఓ వలంటీర్. వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ కొండపల్లి గ్రామానికి చెందిన బడే గుణవతి ఆనారోగ్యంతో గత కొంత కాలంగా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం పింఛన్ పంపిణీకి చివరి రోజు కావడంతో వలంటీర్ మడ్డు మధు రాత్రి ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పింఛన్ డబ్బులు అందించారు. అలాగే ఆమె రక్తహీనతతో బాధ పడుతుండడంతో రక్తదానం చేశాడు. దీంతో పంచాయతీ పెద్దలు వలంటీర్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment