
నిర్మాణంలో ఉన్న షెడ్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నేషనల్ లైవ్ స్టాక్ మిషన్.. గొర్రెలు, మేకల పెంపకం దారులకు రాయితీపై ఆ మూగజీవాలను అందజేసే మహత్తర పథకం. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మన జిల్లాలోనూ 24మంది ఒక్కొక్కరు రూ.కోటి యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నాలుగు యూనిట్లు ఇప్పటికే మంజూరై లబ్ధిదారులకు కూడా అందించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
ఎలా ఇస్తారు..?
● 50 శాతం రాయితీపై ఈ యూనిట్లను అందజేస్తున్నారు.
● బ్యాంక్‌విల్లింగ్ తప్పనిసరిగా ఉండాలి.
● యూనిట్ విలువ కంటే 200 శాతం విలువైన ల్యాండ్, భవనాలు వంటివి బ్యాంక్‌కు ష్యూరిటీ ఇవ్వాలి.
● ఎన్‌ఎల్‌ఎంద్వారా యూనిట్ మంజూరైన తర్వాత షెడ్ల నిర్మాణానికి 25 శాతం అమౌంట్‌ని రిలీజ్ చేస్తారు.
● ఆ తర్వాత పశువైద్యాధికారి, జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కలిపి సిర్టిఫికెట్ చేస్తే గొర్రెలు, మేకల కొనుగోలుకు 75 శాతం లబ్ధిదారుని ఖాతాలో వేస్తారు.
● పూర్తిగా లోన్ సేంక్షన్ అయిన తర్వాత గొర్రెలు, మేకల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంతో ఆరు నెలల నుంచి 60 నెలల్లోగా రీ–పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
● ఏ కులానికి చెందినవారైనా ఈ పధకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన పత్రాలివే..
ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ, పాస్‌పోర్టుసైజు ఫొటోలు, బ్యాంక్‌ష్యూరిటీ ఇవ్వాలి. వీటితో పాటు సంబంధిత లబ్ధిదారుని వివరాలతో ప్రాజెక్టు రిపోర్టు పశుసంవర్ధకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయానికి ఇవ్వాలి.
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్‌ఎల్‌ఎం)తో పేదలకు భరోసా
జిల్లాలో నేటి వరకు రూ.24కోట్లకు ప్రతిపాదనలు
50 శాతం రాయితీపై గొర్రెలు, మేకలు అందజేత
యూనిట్ విలువ తదితర వివరాలు
యూనిట్ విలువ గొర్రెలు, కావాల్సిన షెడ్‌సైజు
మేకలు స్థలం
రూ 20లక్షల 100 1 ఎకరాలు 55x20–35x20
రూ. 40లక్షలు 200 2 ఎకరాలు 55x40–35x40
రూ.60లక్షలు 300 3 ఎకరాలు 55x60–35x60
రూ.80లక్షలు 400 4 ఎకరాలు 55x80–35x80
రూ.కోటి 500 5 ఎకరాలు 55x100–35x100
జీవితకాలం రుణపడి ఉంటాం
ఏ ఆదరవు లేని మాకు ఎన్‌ఎల్‌ఎం పథకం ద్వారా కోటి విలువైన యూనిట్ ఇచ్చి ఆదుకున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. పశుసంవర్ధక శాఖ ఈడీకి, ప్రభుత్వానికి జీవిత కాలం రుణపడి ఉంటాం.
– పొన్నాన మోహనరావు, పొన్నాన గ్రామం, కోటబొమ్మాళి మండలం
గొప్ప అవకాశం
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా గొర్రెలు, మేకలు కొనుగోలుకి ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారందరూ వినియోగించుకోవాలి. 50శాతం రాయితీపై యూనిట్లను అందిస్తున్నాం. బ్యాంక్‌విల్లింగ్, షెడ్‌ల నిర్మాణానికి కావాల్సిన స్థలం వంటివి ఉండి పశుసంవర్ధకశాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఎన్‌ఎల్‌ఎం ద్వారా యూనిట్లను మంజూరు చేస్తాం. ఇప్పటికే కోటి రూపాయల విలువైన యూనిట్లను 24 మందికి ఇవ్వడానికి అవకాశం కల్పించాం. ఇప్పటివరకు నాలుగు యూని ట్లు మంజూరు కాగా 20 యూనిట్లు పలు దశల్లో ఉన్నాయి.
– డాక్టర్ పొట్నూరు సూర్యం,
పశుసంవర్ధకశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీకాకుళం జిల్లా.
బతుకుపై భరోసా కల్పించారు
గొర్రెలు, మేకలు కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషం. దీంతో బతికేందుకు భరోసా దొరికింది. బ్యాంకువారు, పశుసంవర్ధకశాఖ అధికారుల సహకారంతోనే యూనిట్‌ను దక్కించుకోగలిగాం. – బోలుబద్ర నాగేశ్వరరావు, సీతారాంపల్లి, టెక్కలిమండలం.



Comments
Please login to add a commentAdd a comment