కవిటి: అతిథి దేవోభవ అన్న ఆర్యోక్తిని కవిటి మండలం ఆర్.భైరిపురం వాసులు చేసి చూపించారు. ఇటలీలోని రోమ్ నగరానికి చెందిన ఎమ్మా ఎన్‌గ్రేసియా అనే యువతి ఇండియాలో కోల్‌కతా నుంచి కేరళ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం బరంపురం నుంచి బయలుదేరి 65 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రయ్యే సరికి కవిటి మండలం ఆర్.భైరిపురం చేరుకున్నారు. ఇక్కడ బొర్ర పృథ్వీ అనే యువకుడు ట్రా వెలింగ్ కౌచ్ యాప్ ద్వారా ఆమెకు ఆతిథ్యం ఇచ్చాడు. దీంతో ఆమె అచ్చ తెలుగు ఆడపడుచులా మారి వారితో కలిసిపోయారు. తాను ఇప్పటివరకు 951 కిలోమీట ర్లు యాత్ర చేశానని, ఇంకా 1800 కిలోమీట ర్లు ప్రయాణించాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ జరిగిన ఓ పెళ్లికి కూడా హాజరై సందడి చేశారు. ఇక్కడి ప్రజల ఆత్మీ యత, ఆదరణ తనను మంత్రముగ్ధురాల్ని చేసిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment