పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
● దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులే
శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత్రునివలస పరిధిలోని టిడ్కో కాలనీ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సీక్రెట్‌గా గంజాయి సేవిస్తుండగా రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ చదువుతున్న వారే కావడం గమనార్హం. అయితే ఇందులో విశాఖపట్నంకు చెందిన వారు ఇద్దరు కాగా, శ్రీకాకుళానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరంతా శ్రీకా కుళంలోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు తెలు స్తోంది. పట్టుబడిన వారి వద్ద నుంచి అరకిలోకు పైగానే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై టౌన్ సీఐ పైడపునాయుడును వివరణ కోరగా ఆరుగురు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. ఎంత మోతాదుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించగా కేవలం 50–60 గ్రాము లు మాత్రమే వారివద్ద ఉందన్నారు. వీరిపై కేసు నమోదు చేయ లేదని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విదేశీ ఉద్యోగాలంటూ మోసం
సంతబొమ్మాళి: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు టోపీ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నర్సాపురం పంచాయతీ బడే నర్సాపురం గ్రామానికి చెందిన మోడీ భాస్కర్‌రెడ్డి కోటబొమ్మాళిలో శ్రీమారుతి వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఇటలీలో ఉద్యోగాలంటూ ఇన్ స్టిట్యూట్‌లో పలువురు యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వద్ద నుంచి సుమా రు కోటి రూపాయలు వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. గడువు దాటినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు మంగళవారం కోటబొ మ్మాళి ఇన్‌స్టిట్యూట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వారికి సమాధానం చెబుతూ బడే నర్సాపురంలో ఉన్న ఇంటికి వెళ్లడంతో అక్కడకు వెళ్లిన బాధితులు భాస్కర్‌రెడ్డితో వాగ్వా దానికి దిగారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను ఏజెంట్‌కు ఇచ్చి తాను మోసపోయానని భాస్కర్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. శాంతించని యువకులు నిలదీయడంతో.. వారి నుంచి తప్పించుకొని బైక్‌పైన కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ కూడా బాధిత యువకులు ఆందోళన చేపట్టారు.
శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 3.33 లక్షలు
జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3,33,634 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపారు. 84 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెగా డీఎస్సీ హామీ ఏమైంది..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అని చెప్పి నేటికీ భర్తీ చేయకపోవడం దారుణమని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ఎన్.ఆర్ దాసరి క్రాంతి భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ లేక లక్ష లాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్‌లలో లక్షలాది రూపాయలు ఽఖర్చుచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణా ల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న పె ద్దలు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్. రామోజీ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment