ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వినాయకం బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా కుడిమి వినాయకం గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో పల్నా డు జిల్లాలో రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ అందజేసేలా కృషి చేస్తానన్నారు.
ఇన్‌చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జగన్నాయకులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అదనపు జడ్జి కోర్టు, జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సోంపేట కోర్టు పీపీ దువ్వు జగన్నాయకులు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టుకు వచ్చిన ఈయన న్యాయమూర్తులను, బార్ సభ్యుల ను, ఇప్పటి వరకు పీపీ బాధ్యతలు నిర్వర్తించి న వాన కృష్ణచంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బార్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ని సూర్యారావు, జిల్లా బార్ ప్రతినిధులు మరిసర్ల అన్నంనాయుడు, బీసీ న్యాయ వాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, ఎస్.వెంకటరావు, కొమ్ము రమణమూర్తి, టి.ఖగేంద్రనాథ్, ఎన్.శ్రీరామమూర్తి, బొత్స సుదర్శన్, టి.రామారావు, ఎన్.దుర్గా శ్రీనివాసరావు, జి.వెంకటేష్ పాల్గొన్నారు.
చోరీ కేసులో నగలు రికవరీ
ఎల్.ఎన్.పేట: మండలంలోని చిట్టిమండలం కాలనీలో నివాసముంటున్న ఎ.లక్ష్మీ ఇంట్లో చోరీ ఘటనకు సంబంధించి నాలుగు తులాల బంగారు నగలు రికవరీ చేసి బాధితురాలికి అప్పగించామని సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి గురువారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళ దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నగలు రికవరీ చేసి బాధితురాలికి అప్పగించామని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వినాయకం బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment