ఆదివాసీలకు న్యాయం చేయాలి
ఆమదాలవలస : సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో వేల ఎకరాల్లో చేపట్టనున్న థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో ఆదివాసీలు, గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, కూటమి ప్రభుత్వ చర్యను అడ్డుకుని స్థానికులకు న్యాయం చేయాలని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. గురువారం పాలకొండ విచ్చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని సరుబుజ్జిలి, బూర్జ థర్మల్ పవర్‌ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి అత్తులూరి రవికాంత్, ఆయా మండలాల నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.పరిశీలించిన జగన్ తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు రవికుమార్ తెలిపారు. పేదలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్నారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పోరాట కమిటీ నాయకులు సురేష్‌దొర, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment