అర్ధశతాబ్దపు అద్భుతం
కొత్తూరు: కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. కాలేజీ గోల్డెన్ జూబ్లీని శుక్రవారం నిర్వహించేందుకు సిబ్బంది సర్వం సిద్ధం చేశారు. 1974లో కాలేజీ ఏర్పాటైంది. కాలేజి మొదటి ప్రిన్సిపాల్ ఎద్దు గోపాలదాసు నాయుడు. ప్రస్తుతం కాలేజీలో 300 మంది వరకు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఘనతను ఈ కాలేజీ సొంతం చేసుకుంది. ఇక్కడ చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొత్తూరులో కాలేజీ ఏర్పాటు కోసం స్థానిక నాయకుడు లోతుగెడ్డ చంద్రయ్య నాయుడు, మాజీ మంత్రి గొర్లె శ్రీరాములు నాయుడు కృషి చేశారు. 1972 ఏడాది నుంచి కాలేజీ కోసం ప్రయత్నాలు చేయగా 1974లో ఏర్పాటైంది. మొదట ఉన్నత పాఠశాల గదుల్లో తరగతులు ప్రారంభించారు. కొత్తూరు, భామిని, హిరమండలం, సీతంపేట, ముమ్మలక్ష్మిపురంతో పాటు పలు ప్రాంతాలకు ఈ కాలేజీ ఎంతో కీలకంగా నిలిచింది.
అర్ధశతాబ్దపు అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment