బొడ్డపాడులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
పలాస: పలాస మండలం బొడ్డపాడులో మార్చి 1న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు షీల్డుతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ. 10వేలు ఇస్తామన్నారు. క్రీడాకారులు త మ జట్టుతో మార్చి 1న హాజరు కావాలని, క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.300లు చెల్లించి తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం 8309642480 సెల్ నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.
ఉప్పు పరిశ్రమపై దౌర్జన్యం
సంతబొమ్మాళి: నౌపడ ఉప్పు పరిశ్రమపై మూలపేట పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై నౌపడ సాల్ట్ రన్ 1956 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎన్‌ఎస్ కంపెనీ) యాజమాన్యం, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, నష్ట పరిహారం చెల్లించకుండా వారి ఆధీనంలో ఉన్న ఉప్పు మడులపై పోర్టు యాజమాన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎస్‌ఎస్ కంపెనీ మేనేజర్ దివాకర్ షాతో పాటు ఉప్పు కార్మికులు, సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. జరిగిన నష్టాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అయినా పోర్టు సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగించారు. దీంతో ఏమీ చేయలేక ఎన్‌ఎస్‌కంపెనీ సిబ్బంది, ఉప్పు కార్మికులు వెనుదిరిగారు. అ నంతరం రోడ్డు నిర్మాణానికి తమ ఉప్పు భూ ములు ఎంత వరకు తీసుకుంటున్నారో పోర్టు యాజమాన్యం వెల్లడించలేదని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు వేయడం వల్ల ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment